రావికమతం: అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేసినా, పేలుడు పదార్థాలు నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్ల ఘటన నేపథ్యంలో రావికమతం పోలీస్ స్టేషన్ పరిధి కొమిరలో భూమి ఎంటర్‌ప్రైజస్ మ్యాగజైన్‌ను మంగళవారం ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్‌ఐ రఘువర్మలతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. మ్యాగజైన్‌కు 2030 వరకు పీఈఎస్‌వో లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రజలకు, జీవాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించారు. లైసెన్స్ హోల్డర్‌ను హ్యాండ్లింగ్ నిల్వ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.


