● చంద్రగ్రహణం కారణంగా ఉదయం స్వామివారి చక్రవారీస్నానం ● సంప్రోక్షణ అనంతరం రాత్రికి డోలోత్సవం
ఉపమాక వెంకన్న ఆలయం, మోదకొండమ్మ
నక్కపల్లి : కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు తెలిపారు. సాయంత్రం ఏడుగంటల దాటిన తర్వాత సంప్రోక్షణ అనంతరం వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మిగిలిన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముందుగా స్వామివారికి తిరువీధి సేవ లు, అనంతరం స్వామివారి చక్రవారీ స్నానం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి డోలోత్సవం నిర్వహిస్తారు.
నేడు మోదకొండమ్మ ఆలయం మూసివేత
మాడుగుల: మోదకొండమ్మ ఆలయం ఈ నెల 3 వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా ఉద యం 9 గంటల నుంచి బుధవారం తెల్లవారు వర కు మూసి వేయడం జరుగుతుందని, సంప్రోక్షణ అనంతరం 10 గంటలకు దర్శనాలు ప్రారంబిస్తామని ఆలయ చైర్మన్ అప్పలరాజు తెలిపారు.


