పారా బ్యాడ్మింటన్‌ విజేతలకు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

పారా బ్యాడ్మింటన్‌ విజేతలకు కలెక్టర్‌ అభినందన

Mar 3 2026 8:03 AM | Updated on Mar 3 2026 8:03 AM

గూనూరు ఆదిలక్ష్మిని అభినందించిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తదితరులు

రావికమతం : విజయనగరంలో ఇటీవలే జరిగిన రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పోటీల్లో రావికమతం మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు గూనూరు ఆదిలక్ష్మి , రాజాన మానస, నమ్మి హేమ దుర్గ విజయ కేతనం ఎగురవేసి జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీలకు ఎంపికైన సంగతి తెలిసిందే. వారిని అనకాపల్లిలో సోమవారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయ అధికారి బి.రామకృష్ణనాయుడు అభినందించి ఘనంగా శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. జాతీయ స్థాయి పారా బ్మాడ్మింటన్‌ పోటీల్లో ఘన విజయం సాధించి అనకాపల్లి జిల్లాకు మంచి పేరు తీసురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు, జగన్నాథనాయుడు, దేవుడునాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement