ఆదుకునే చిత్తశుద్ధి ఏదీ...
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి పట్టణానికి భవన నిర్మాణ కార్మికులు వస్తారు. ఎండ, వాన లెక్క చేయకుండా పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనిచేసే ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతాయి. కార్మికులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మృత్యువాత పడగా మరికొందరు క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ప్రభుత్వమే కొంత నిధిని ఇవ్వాలి.
–అప్పలనాయుడు, ఊడేరు గ్రామం, అనకాపల్లి మండలం


