విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

Mar 1 2026 7:45 AM | Updated on Mar 1 2026 7:45 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు సూచనలు ఇస్తున్న డీఈవో అప్పారావు నాయుడు

పాయకరావుపేట: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని డీఈవో జి.అప్పారావు నాయుడు తెలిపారు. మండలంలో మంగవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. టెన్త్‌ పరీక్షలు మార్చి 16న ప్రారంభమవుతాయని, ఇంకో 15 రోజులు మాత్రమే సమయం ఉందని తెలిపారు. ఈ 15 రోజులు ఎంతో కీలకమని, ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రమేష్‌బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement