నేడు ఘాట్‌రోడ్‌లో మోదకొండమ్మ పాదాలు తీర్థం
ఘాట్‌రోడ్ జంక్షన్‌లో వెలసిన మోదకొండమ్మ పాదాలు
మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఘాట్‌రోడ్ జంక్షన్‌లో వెలసిన మోదకొండమ్మ పాదాలు తీర్థాన్ని వర్తక సంఘం,ఉత్సవ కమిటీ, ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. తీర్థం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ కోరింది.
ఆది సోమ
నేడు ఘాట్‌రోడ్‌లో మోదకొండమ్మ పాదాలు తీర్థం


