శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
విద్యార్థుల పఠన సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్న జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత
అధికారిమంగవేణి
నర్సీపట్నం: ఇంటర్మీడియేట్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్ధులు కష్టపడి చదవాలని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి జి.మంగవేణి విద్యార్ధులకు సూచించారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహం–2ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. పరీక్షలు ఎలా రాస్తున్నారని విద్యార్ధులను ఆరా తీసారు. కష్టపడి చదివి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు.


