రిటైర్డ్ హోంగార్డుకు రూ. 4.06 లక్షల ఆర్థిక సాయం
పదవీ విరమణ పొందిన హోంగార్డుకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: విశేష సేవలందించి పదవీ విరమణ చేసిన హోంగార్డు రాజారావుకు తోటి సిబ్బంది రూ.4.06 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కమ్యూనికేషన్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన రాజరావుకు శనివారం ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరిపాలన అధికారి సీహెచ్.తిలక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


