బాడీబిల్డింగ్‌లో కానిస్టేబుల్‌ సత్తా.. ఎస్పీ అభినందన | - | Sakshi
Sakshi News home page

బాడీబిల్డింగ్‌లో కానిస్టేబుల్‌ సత్తా.. ఎస్పీ అభినందన

Feb 28 2026 7:23 AM | Updated on Feb 28 2026 7:23 AM

బాడీబిల్డింగ్‌లో కానిస్టేబుల్‌ సత్తా.. ఎస్పీ అభినందన

బాడీబిల్డింగ్‌లో కానిస్టేబుల్‌ సత్తా.. ఎస్పీ అభినందన

ఆరిలోవ(విశాఖ తూర్పు): బాడీబిల్డింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించిన కానిస్టేబుల్‌ జి.శ్రీనివాసరావును అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా అభినందించారు. ఇటీవల విశాఖ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన తొమ్మిదో మిస్టర్‌ ఆంధ్ర బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌–2026లో మాస్టర్స్‌ కేటగిరీలో అనకాపల్లి జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌ జి.శ్రీనివాసరావు రజత పతకం సాధించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కై లాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగంలో పనిచేస్తూ జిల్లా పోలీస్‌ జిమ్‌ ట్రైనర్‌గా అధికారులు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కై లాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీనివాసరావును ఎస్పీ సిన్హా సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శ్రీనివాసరావు ఇంతవరకు 25 సార్లు మిస్టర్‌ ఆంధ్రగా నిలిచినట్లు తెలిపారు. 2013లో మిస్టర్‌ సౌత్‌ ఇండియా గోల్డ్‌ మెడల్‌ సాధించారన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహస్తూ క్రీడలపై అంకితభావం కనబరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్‌, ఎల్‌.మోహనరావు, ఎస్‌బీ డీఎస్పీ జి.ఆర్‌.ఆర్‌.మోహన్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement