8న గురుకులం ప్రవేశ పరీక్ష
దేవరాపల్లి: డాక్టరు బీఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ కోసం ప్రవేశ పరీక్షను మార్చి 8న నిర్వహిస్తున్నట్లు తెనుగుపూడి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్‌పాల్ తెలిపారు. మార్చి 2న జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్ష తేదీని మార్పు చేస్తూ ఉమ్మడి విశాఖ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జి. గ్రేస్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మార్చి 8న 6, 7 తరగతులకు ఉదయం 10 నుంచి 11:30 గంటలకు వరకు, 8, 9, 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ 0891–2799641 సంప్రదించాలని కోరారు.


