నగరవనంను సందర్శించిన సీసీఎఫ్ బి.ఎం.దివాన్ మైదీన్
నర్సీపట్నం : ఆరిలోవ అటవీ ప్రాంతంలో నిర్మితమవుతున్న నగరవనాన్ని సీసీఎఫ్ బి.ఎం.దివాన్ మైదీన్, డీఎఫ్‌వో ఎం.శామ్యూల్‌తో కలిసి గురువారం సందర్శించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అటవీశాఖ వారు సుమారు రూ.1.60 కోట్లతో నగర వనంను తయారు చేస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న నగరవనం పనులను సీసీఎఫ్ పరిశీలించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని రేంజర్ రాజేష్‌ను ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా నగరవనం తయారు చేయాలని సూచించారు. వనంలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ డీఎఫ్‌వో చిదానంద, ఎఫ్‌ఎస్‌వో రామాంజులు, బీట్ సిబ్బంది ఉన్నారు.


