‘గోవ’ పండగ... ఆనందం నిండుగా... | - | Sakshi
Sakshi News home page

‘గోవ’ పండగ... ఆనందం నిండుగా...

Feb 25 2026 8:59 AM | Updated on Feb 25 2026 8:59 AM

‘గోవ’

‘గోవ’ పండగ... ఆనందం నిండుగా...

కె.కోటపాడు : ఆర్లి గ్రామంలో గంగాదేవి(గోవ) పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఐదేళ్లకు ఒక మారు గ్రామస్ధులు అమ్మవారి పండగను నిర్వహించడం ఆచారంగా వస్తుంది. పండగ పర్వదినం కావడంతో గంగాదేవి ఆమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పందిరికి మొక్కులలో భాగంగా కొబ్బరి, అరటి, ద్రాక్ష పండ్లతో పాటు, నగదు, చీరలను వేలాడదీశారు. మధ్యాహ్నం పందిరికి వేలాడదీసిన వస్తువులను భక్తులు పొందేందుకు దోపిడీ కార్యక్రమం నిర్వహించగా భక్తులంతా ఉత్సాహంగా పోటీపడ్డారు. భక్తులకు లభించే వస్తువు అమ్మవారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. పండగ సందర్భంగా బంధువులు, స్నేహితుల రాకతో గ్రామమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా తప్పెటగుళ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

‘గోవ’ పండగ... ఆనందం నిండుగా... 1
1/1

‘గోవ’ పండగ... ఆనందం నిండుగా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement