చూడ‘చెక్కిన’ తాజ్ అందం
● లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
పెన్సిల్ ముల్లుపై చెక్కిన తాజ్‌మహల్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇచ్చిన
ప్రశంసాపత్రంతో వెంకటేష్
నక్కపల్లి : మండలంలో చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్‌ముల్లుపై తాజ్ మహల్ చెక్కాడు. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి 4 మిల్లీమీటర్ల వెడల్పు, 4 మిల్లీమీటర్ల ఎత్తుతో పెన్సిల్ ముల్లుపై తాజ్‌మహల్‌ను రూపొందించాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. వెంకటేష్ గతంలోనూ ఇలా ఎన్నో సూక్ష్మకళాఖండాలను రూపొందించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం విశేషం.
చూడ‘చెక్కిన’ తాజ్ అందం


