మూగ నివేదన! | - | Sakshi
Sakshi News home page

మూగ నివేదన!

Feb 25 2026 8:58 AM | Updated on Feb 25 2026 8:58 AM

మూగ న

మూగ నివేదన!

వైద్యమందక...

పశువులకు సేవలు అందిస్తున్న గోపాలమిత్ర

నాతవరం : పేదవాడి ట్రాక్టరు పాడి పశువు అన్నది పూర్వపు సామెత. రైతులకు అంత ప్రాధాన్యం కలిగిన పశువుకు ఎలాంటి రోగం వచ్చిన వైద్యసేవలు అందించే నాధులు కరువయ్యారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో మొత్తం 67 వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు పోస్టులకు 9 తొమ్మిది మందిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నియమించక ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు 48 మందికి 24 మంది నియమించలేదు. వీరంతా క్షేత్ర స్థాయిలో పశువైద్యశాలలో రైతులకు అందుబాటు ఉండాలి కానీ పూర్తి స్థాయి సిబ్బంది లేక జిల్లాలో చాలా పశువైద్యశాలలు తెరుచుకోక ఎప్పుడు చూసినా మూసి ఉంటున్నాయి. జిల్లాలో కుసర్లపూడి ఎం.కోడూరు కె.జె.పురం, బూరుగుపాలెం, వడ్డాది, నాతవరం, కొరుప్రోలు, ఏటికొప్పాక ప్రాంతాల్లో గల పశువైద్యకేంద్రాల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు రెండేళ్లుగా ఖాళీగానే ఉండడంతో ఈ ప్రాంత పాడి రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు నియామకాలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించక పశువులకు ఎలాంటి వైద్య సేవలు అందాలన్నా గోపాలమిత్ర లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు వెటర్నరీ లైవ్‌స్టాక్‌ అఫీసర్లు, లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. అదే విధంగా జిల్లాలో మొత్తం 446 ఆర్‌ఎస్‌కేలు పరిధిలో 198 వెటర్నరీ క్లస్టర్లు ఉన్నాయి. వాటిలో సుమారుగా 82 వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పశువులకు వైద్య సేవలు పొందడం కష్టంగా మారింది. రైతులకు జీవనాధారంగా వ్యవసాయం తర్వాత పాడి పశువులు మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంపై ఆధారపడుతున్నారు. వాటికి ఎలాంటి ఆనారోగ్య సమస్య వచ్చినా పశువైద్యాధికారులు సేవలు అందించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి పూర్తిస్థాయిలో పశువైద్యాధికారులు, సిబ్బంది లేక పాడి రైతులు అనేక బాధలు పడుతున్నారు. చాలా గ్రామాల్లో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందక వేలాది రూపాయలు విలువ చేసే పశువులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో పాడిరైతులకు పశువైద్యశాలల ద్వారా పశుగ్రాసం, విత్తనాలు రాయితీపై సరఫరా చేసేవారు. పశువులకు, లేగదూడలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు వేసేవారని, ఇటీవల కాలంలో వాటికి దూరమయ్యామని రైతులు అంటున్నారు.

వైద్య సిబ్బంది కొరత...

నాతవరం మండలంలో నాతవరం, గునుపూడి, శృంగవవరం ప్రాంతాల్లో పశువైద్యశాలలు ఉన్నాయి. గునుపూడి, నాతవరం పశువైద్యాశాలల్లో వైద్యులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు చూసినా అవి మూతబడి ఉంటున్నాయి. శృంగవరం పశువైద్యశాలలో వైద్యులు ఉన్నా ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండరని రైతులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారులతో పాటు దిగువ స్థాయి సిబ్బంది కూడా లేకపోవడంతో ఈ ప్రాంత రైతులంతా గోపాలమిత్రలపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక శాతం రైతులు పాడిపై అధారపడుతున్నారు. నాతవరం, గునుపూడి పశువైద్యశాలలో వైద్యులను నియమించాలని గత నెలలో మండల ప్రత్యేకాధికారి మంగవేణికి మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, రైతులు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ సమస్య స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తెస్తూ మండల సమావేశంలో చర్చించినా కనీస ప్రయోజనం కలగలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై పాయకరాపుపేట పశుసంవర్ధకశాఖ ఏడీ వెంకట సురేష్‌ను వివరణ కోరగా ప్రభుత్వం కొత్తగా వైద్యాధికారులు, సిబ్బంది నియామకాలు చేయలేదన్నారు. అందువల్ల సిబ్బంది కొరత వెంటాడుతుందని, సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు.

పశువైద్యాధికారులు లేక అందని వైద్యసేవలు

అనేక చోట్ల మూసి ఉంటున్న పశువైద్యశాలలు

క్షేత్రస్థాయి సిబ్బంది లేక గోపాలమిత్రలపై భారం

మూగ నివేదన! 1
1/2

మూగ నివేదన!

మూగ నివేదన! 2
2/2

మూగ నివేదన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement