మొదటి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యం
అనకాపల్లి: క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమని డీఎంహెచ్‌వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను కనుగొనవచ్చన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం క్యాన్సరతో పారాడదాం.. విజయం సాధిద్దాం.. అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీ అధికారి ఎసత్తెర్ రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


