గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
బుచ్చెయ్యపేట: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. చెరకు కాటా వద్ద అనకాపల్లికి చెందిన ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసి, వారి నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
యలమంచిలి రూరల్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొడ్డు శ్రీనివాస్‌ను వరుసగా రెండోసారి నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం యలమంచిలిలో ఉన్న ఆయన స్వగృహంలో ఆ పార్టీకి చెందిన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి తనకాల అనంతరావు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంవీఆర్ రాహుల్,దొడ్డి రవి,రావి రామసత్యం, నాగమంత్రి సాయి, సుందరపు ఈశ్వర్రావు పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు


