సరకు రవాణాకు ప్రత్యేక ప్రణాళికలు
సాక్షి, విశాఖపట్నం: రైల్వే వ్యవస్థలో సరకు రవాణా సజావుగా జరిగేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి.. వాటిని పక్కాగా అమలు చేసేందుకు కృషి చెయ్యాలని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారుల్ని సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సీఏవో అంకుష్ గుప్తా, వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బోరా, ఇతర అధికారులతో కలిసి విశాఖలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సరకు రవాణాలో సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యానికి వీలైనంత త్వరగా చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్‌సీసీఐఎల్ వార్షిక అభివృద్ధి నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించి.. రైల్వే అధికారులకు అందించారు.
అధికారులతో డీఎఫ్‌సీసీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్


