సింహాద్రి ఎన్టీపీసీ కొత్త బాస్ ‘అయస్కాంత జెనా’
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ బిజినెస్ యూనిట్ నూతన హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్‌గా అయస్కాంత జెనా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ 14 నెలల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ శర్మ ఢిల్లీలోని ఐటీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సికింద్రాబాద్ ఈఎన్‌జీజీ ప్లానింగ్ సీజీఎంగా పనిచేస్తున్న జెనా ఇక్కడకు బదిలీపై వచ్చారు. నూతన హెచ్‌వోపీగా బాధ్యతలు చేపట్టిన జెనాకు ప్లాంట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. 1990లో ఎన్టీపీసీలో చేరిన ఆయనకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టాస్క్ ఫోర్స్ కార్యకలాపాల్లో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాద్రి ఎన్టీపీసీలో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ, ప్రాజెక్టును ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.


