నాడు వద్దన్నవే... నేడు దిక్కయ్యాయి
గత ప్రభుత్వంలో సచివాలయాలు నిర్మిస్తుంటే ప్రతిపక్ష టీడీపీ తీవ్రమైన విమర్శలు చేశారు. కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అవే దిక్కయ్యాయి. సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది.అన్ని రకాల సేవలు సచివాలయంలో గ్రామంలోనే పొందే అవకాశం కలిగింది. మండల కేంద్రానికి వెళ్లే బాధలు తప్పాయి.వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్ద పేరుమార్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో మాత్రం సచివాలయాల వ్యవస్ద బలంగా నాటుకుపోయింది. పేర్లు మార్చినా సేవలను మార్చడం ఈజీ కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవస్దను మరింత బలోపేతం చేయాలి అంతే గాని నిర్వీర్యం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
–వీసం రామకృష్ణ, నక్కపల్లి


