ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
ఆత్మహత్య చేసుకునేందుకు శారదానది వద్దకు వచ్చిన నాగరత్నంతో మాట్లాడుతున్న కానిస్టేబుల్
అనకాపల్లి: శారదానదిలో పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న ఓ వృద్ధురాలిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చింతావారి వీధికి చెందిన పల్లి నాగరత్నం(70) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది శారదానదిలో పడి మృతి చెందేందుకు ఆదివారం బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొంత కాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు నదివద్దకు వచ్చానని ఆమె తెలిపినట్టు పోలీసులు చెప్పారు.
తారుమారు సంతకు ఏర్పాట్లు
జి.మాడుగుల: సంక్రాంతి పండగ పురస్కరించుకుని జి.మాడుగులలో వెంకటరాజు ఘాట్ వద్ద పొలాల్లో నిర్వహించే తారుమారు సంత ఏర్పాట్ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిని ఆదివారం మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, సర్పంచ్ కిముడు రాంబాబు, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, సంత నిర్వహణ కమి టీ నాయకుడు మత్స్యరాస నాగరాజు ప్రారంభించారు. జనవరిలో తొలి మంగళవారం జరిగే ఈ తారుమారు సంత నిర్వహిస్తారు.


