అక్రమ క్వారీలో మళ్లీ తవ్వకాలు
రోలుగుంట: మండలంలోని వెదుళ్లవలసలో అధికారులు దాడులు చేసి కంప్రెసర్, కాలం చెల్లిన మెటీరియల్ సీజ్ చేసిన క్వారీలో ఆదివారం మళ్లీ యథాతథంగా తవ్వకాలు జరిపారు. క్వారీపై ఫిర్యాదు రావడంతో శుక్రవారం అధికారులు దాడులు చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే వారి ఆదేశాలను భేఖాతరు చేస్తూ క్వారీ లీజుదారుడు ఆదివారం నుంచి మళ్లీ కార్యకలాపాలను కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన ఫిర్యాదుదారుడు బంటు రాజు కార్వీ వద్దకు వెళ్లి పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ క్వారీలో పనులు ప్రారంభించారని ఆరోపించారు. అధికారుల దాడులు చేయడం ఉత్తుత్తిదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని ఆయన కోరారు.


