సచివాలయం అద్దె చెల్లింపు
లోపూడి సచివాలయ
అద్దె నగదును అందిస్తున్న సెక్రటరీ రామిరెడ్డి
బుచ్చెయ్యపేట: మండలంలోని లోపూడి సచివాలయ అద్దెను అధికారులు చెల్లించారు. అద్దె చెల్లించకపోవడంతో సచివాలయానికి తాళాలు అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురించిన వార్తకు మండల అధికారులు,సచివాలయ ఉద్యోగులు స్పందించారు. సచివాలయ భవన యజమాని కుటుంబ సభ్యులకు అద్దె నగదును నాయకుల సమక్షంలో సచివాలయ సెక్రటరీ రామిరెడ్డి అందజేశారు. సచివాలయానికి వేసిన తాళాలను భవన యజమాని నుంచి సచివాలయ సెక్రటరీ తిరిగి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
సచివాలయం అద్దె చెల్లింపు


