బాక్సింగ్ క్రీడాకారులకు అభినందన
బాక్సింగ్ క్రీడాకారులను అభినందిస్తున్న అవంతి కాలేజీ ప్రిన్సిపాల్ మోహనరావు, శాప్ కోచ్ అబ్బు
నర్సీపట్నం : కాకినాడ జిల్లా, పిఠాపురంలో జరిగిన స్టేట్ సీనియర్, యూత్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అవంతి ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు మెడల్స్ సాధించారు. జి.సాయి 52 కేజీల విభాగంలో కాంస్య పతకం, వై.హాసిని 64 కేజీల విభాగంలో కాంస్యపతకం సాధించారు. వీరిని అవంతి కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్‌రావు, హెచ్‌వోడీ గోవింద్, శాప్ కోచ్ అబ్బు అభినందించారు. బాక్సింగ్‌లో మరింత శిక్షణ పొందేందుకు వీలుగా కాలేజీ ప్రిన్సిపాల్ మోహనరావు స్పోర్ట్స్ కిట్స్‌ను అందజేశారని కోచ్ అబ్బు తెలిపారు.


