వ్యసనాలకు బానిసలు కావద్దు
ఘటనపై విచారణకు ఆదేశించాం
● జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి సెజ్‌లో ఎస్‌వీఎస్ ఫార్మా పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శనివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభించిందని, వెంటనే చర్యలు తీసుకొని మంటలను అదుపుచేసినట్టు తెలిపారు. ఈ పరిశ్రమ 2023లో స్థాపించడం జరిగిందని, ఈ పరిశ్రమంలో 25 మంది ఆన్–రోల్ ఉద్యోగులు, దాదాపు 8 మంది రోజువారీ కార్మికులు పనిచేస్తారని, ఈ ఘటన జరిగినప్పుడు 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. సెంట్రి ప్యూజ్ చివరి దశ ఆపరేషన్ సమయంలో 4–మిథైల్–2–సైనో బైఫినైల్ ఉత్పత్తిలో రియాక్షన్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, కాగా ఈ ప్రక్రియలో ఇంటర్మీడియట్ ద్రావకం వలే ఉపయోగించే టోలున్ ద్రావకాన్ని నిర్వహిస్తుండగా మంటలు చెలరేగినట్టు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో, పని ప్రదేశంలో డైరెక్టర్ లోకేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, రసాయన శాస్త్రవేత్త కుమార్‌లు కంపెనీ ఆవరణలో ఉన్న ఇతర ఉద్యోగులతో కలిసి, ఎటువంటి గాయాలు కాకుండా యూనిట్‌ను సురక్షితంగా తరలించారని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.
వ్యసనాలకు బానిసలు కావద్దు
వ్యసనాలకు బానిసలు కావద్దు


