అతిప్రయాస మీద అదుపులోకి మంటలు
ఎస్వీఎస్ కెమెకల్ ఇండస్ట్రీస్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో కంపెనీలో మొత్తం దాదాపు అన్ని విభాగాలు దగ్ధమైనట్టు అగ్నిమాపక నివారణ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. శనివారం సాయంత్రం 4.25 గంటలకు సెంట్రీప్యూజ్ వద్ద ఉత్ప్రేకంగా ఉపయోగించిన టొయలీన్ పేలడంతో కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ముడిసరుకుగా ఉపయోగించే సోడియం డ్రైఆకై ్సడ్, డై మిథైల్ సల్ఫేట్, టయోలిన్ సాల్వెంట్‌లు ఇంతటి ప్రమాద తీవ్రతకు కారణమయ్యాయి. ప్రమాద తీవ్రతతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.దీంతో ఎస్‌ఈజెడ్ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. సెంట్రిప్యూజ్ వద్ద టోలున్ సాల్వెంట్‌లో స్పిన్నింగ్ జరుగుతున్న సమయంలో నైట్రోజన్ లేకపోవడం కారణంగా స్పార్కింగ్ అయి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సంబంధిత పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేప్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే భారీగా మంటలు వ్యాపించాయి. మొత్తం 7 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు ఆర్పినా సుమారుగా 3 గంటలు పట్టాయి. జిల్లా ఫైర్ అధికారి వెంకట రమణతో పాటు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు దేవుడునాయుడు డిమాండ్ చేశారు.


