హక్కుల అవగాహన.. సామాజిక బాధ్యత
అనకాపల్లి: ఆహార భద్రత కమిషన్ పర్యవేక్షణకే పరిమితం కాదని, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషనన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. స్థానిక గవరపాలెం కన్సూమర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం ‘మేలుకో...హక్కులు తెలుసుకో – అందరి చట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2013 నుంచి దేశంలో ఆహార భద్రత చట్టబద్దమైన హక్కుగా దక్కిందన్నారు. రేషన్‌్ సరుకులు పంపిణీలో అవకతవకలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీల ద్వారా అందుతున్న పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమల్లో లోపాలను ఆహార భద్రత కమిషన్‌కు లిఖితపూర్వకంగా లేదా వాట్సప్ నెంబర్ 9490551117కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.


