రైతులను నిండా ముంచారు
చెరకు రైతులను చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు నిండా ముంచారు. రైతులకు గిట్టుబాటుధర ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఫ్యాక్టరీనే మూసేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలిసే గోవాడ ఫ్యాక్టరీని అమ్మేయాలని చూస్తున్నారు. అందుకే క్రషింగ్ చేయకుండా వదిలేశారు. ఉద్యమాన్ని అఖిలపక్షం అంతా కలిసి మరింత ఉధృతం చేస్తాం.
–రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం నాయకుడు, సీపీఐ జిల్లా ప్రతినిధి
కూటమికి మద్దతు ఇచ్చి తప్పు చేశాం
గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చి తప్పుచేశాం. ఫ్యాక్టరీని అభివృద్ధిచేసి, చెరకు రైతులను ఆదుకుంటామని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో మద్దతు ఇచ్చాం. తీరా అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని మూసేసి కార్మికులను, రైతులను రోడ్డు పాలుచేశారు. అఖిలపక్షంలో ఫ్యాక్టరీ కార్మికులంతా ఉండి పోరాటం చేస్తాం.
–శరగడం రాము నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు
పవన్‌కల్యాణ్ పట్టించుకోలేదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాం. ఫ్యాక్టరీ సమస్యపై మా నాయకుడు పవన్‌కల్యాణ్‌కు చెప్పాం. మా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏమీ ప్రయోజనం కలగలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ ఏమీ పట్టించుకోలేదు. చెరకు రైతుగా ఉండి పండిన చెరకు ఎక్కడికి పంపించాలో తెలియలేదు. ఫ్యాక్టరీ, చెరకు రైతుల కోసం ఎంతటి ఉద్యమానికై నా సిద్ధం.
–జెర్రిపోతుల నానాజీ, జనసేన, చోడవరం నియోజకవర్గం ప్రతినిధి
రైతులను నిండా ముంచారు
రైతులను నిండా ముంచారు


