కందిపూడిలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ చించివేత
చించేసిన వైఎస్సార్‌సీపీ నాయకుల ఫ్లెక్సీ
బుచ్చెయ్యపేట: మండలంలోని కందిపూడిలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫెక్ల్సీని కూటమి నేతలు చించివేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు కోట్ని అప్పారావు, సర్పంచ్ కొప్పాక గణేష్, మాజీ సర్పంచ్ తాటికొండ కనకయ్య, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు ద్వారపురెడ్డి అచ్చింనాయుడు, సుంకరి గోవింద తదితర్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాఽథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,మండల వైఎస్సార్‌సీపీ నాయకుల ఫొటోలతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కశింకోట,బంగారుమెట్ట(కేబీ) రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే జంక్షన్‌లో ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామానికి చెందిన కూటమి నేతలే చించివేశారని గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మా నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూటమి నేతలు చూడలేక చించివేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కందిపూడి వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.


