35 మంది వాహన చోదకులకు జరిమానా
ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ట్రైనీ డీఎస్పీ కృష్ణచైతన్య
యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణంలో ట్రైనీ డీఎస్పీ కృష్ణచైతన్య ప్రత్యేక డ్రైవ్ ద్వారా శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. ప్రధాన రహదారిపై రద్దీగా ఉండే కూడళ్లలో పలు ద్విచక్ర వాహనాలను ఆయన తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతున్న 20 మందికి, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఐదుగురికి రూ.1,035 చొప్పున, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న ఇద్దరికి రూ.2,035 చొప్పున, మరో పది మందికి జరిమానా విధించారు. తనిఖీల్లో యలమంచిలి ట్రాఫిక్ ఎస్‌ఐ బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


