పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి
రావికమతం: డి.పట్టాలను రద్దు చేసి సాగులో ఉన్న గిరిజనులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ వేయాలని మండలంలో కవగుంట రెవెన్యూలో గిరిజనులు డిమాండ్ శుక్రవారం చేశారు. కవగుంట రెవెన్యూలో సర్వే నంబర్ 59,61,62,63,64,88,89లలో సుమారు 90 ఎకరాలు బంజర్ భూములకు గతంలో గిరిజనులకు డి.పట్టాలు పంపిణీ చేశారు. వారు ఈ భూముల్లో జీడి,మామిడి తోటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో చేసిన సర్వేలో సాగులో ఉన్న గిరిజనులు పేర్లు తొలిగించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృషికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు చెప్పారు.ఇప్పటికై న అధికారులు స్పందించి పాస్ పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆందోళన చేశారు.


