రోడ్డు విస్తరణలో కోల్పోయే వృక్షాలకు పునరుజ్జీవం
● చోడపల్లిలో మిషన్ పునర్వ వనం ప్రారంభించిన కలెక్టరు
చోడపల్లిలో మిషన్ పునర్వ వనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్
విజయ్‌కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్
అచ్యుతాపురం రూరల్: రహదారి విస్తరణలో కోల్పోతున్న భారీ వృక్షాలను కాపాడేందుకు మిషన్ పునర్వ వనం కార్యక్రమం భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. మండలంలోని చోడపల్లిలో రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలను తొలగించి మరో సురక్షితమైన ప్రదేశంలో తిరిగి నాటేందుకు శుక్రవారం ఆమె మిషన్ పునర్వ వనం ప్రారంభించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ పర్యావరణం కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలన్నారు.


