కారుణ్య నియామక పత్రం అందజేత
చంద్రశేఖర్‌కు కారుణ్య నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్‌లో హెచ్‌సీగా విధులు నిర్వహించిన చీమల చెలయ్య 2021లో అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కుమారుడు చంద్రశేఖర్‌కు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు కారుణ్య నియామక పత్రాన్ని శుక్రవారం ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏ.ఓ సిహెచ్.తిలక్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ భీమాబాయి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


