పాల్తేరు టీడీపీలో ఫ్లెక్సీ రగడ
కొట్లాటలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు
పాయకరావుపేట: మండలంలోని పాల్తేరు గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో టీడీపీ నాయకుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఆ పార్టీ రెండు గ్రూపుల వ్యక్తులు ఫ్లెక్సీపై ఫొటోల ముద్రణ విషయంలో ఈ ఘర్షణ జరిగిందని సీఐ జి.అప్పన్న తెలిపారు. ఈ తగదాలో రెండు కుటుంబాల సభ్యులు పరస్పరం కొట్లాటకు దిగడంతో ఇరువర్గాల వ్యక్తులకు గాయాలయ్యాయన్నారు. వారంతా తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సీఐ తెలిపారు. పాల్తేరు గ్రామంలో శాంతి, భద్రతల అదుపు కోసం పెట్రోలింగ్, పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఘర్షణకు పాల్పడిన వారిపై రౌడీషీట్ తెరిచినట్టు సీఐ చెప్పారు.
పాల్తేరు టీడీపీలో ఫ్లెక్సీ రగడ


