ఆర్డీవో కార్యాలయప్రారంభం నేడు
ఎస్.రాయవరం: మండలంలో అడ్డురోడ్డు కేంద్రంగా సబ్ డివిజన్(ఆర్డీవో) కార్యాలయాన్ని బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ప్రారంభించనున్నారు. దీనికోసం తాత్కాలికంగా తిమ్మాపురం –1 సచివాలయం భవనాన్ని ఎంపిక చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో తిమ్మాపురం పంచాయతీ భవనంపై అదనపు సచివాలయ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నుంచి ఇక్కడ ఆర్డీవో అందుబాటులో ఉంటారని తహసీల్దార్ రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.


