
వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు
నాతవరం : మండలంలో గన్నవరం గ్రామానికి చెందిన రామోజు లోవరాజు అనే బుజ్జమ్మ కన్పించలేదని అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు నాతవరం ఎస్‌ఐ సిహెచ్.భీమరాజు తెలిపారు. వివరాలివి. గ్రామంలో టెంట్‌హౌస్ షాపు నిర్వహిస్తున్న రామోజు వెంకట బాబ్జి అనే వ్యక్తి తన భార్య బుజ్జమ్మ (40) ఉదయం నుంచి కనిపించడం లేదని సోమవారం సాయంత్రం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద ఎటువంటి తగాదాలు పడలేదని, ఏ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందో తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు నాతవరం పోలీస్‌స్టేషన్ లేదా ఫోన్ నంబర్ 9491516935కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.