
ఘనంగా శ్రీప్రకాష్ వార్షికోత్సవాలు
గాతా రహే మేరా దిల్‌లో అలరించిన విద్యార్థులు
పాయకరావుపేట : శ్రీప్రకాష్ విద్యా సంస్థల 49వ వ్యవస్థాపక దినం సందర్భంగా సోమవారం అట్టహాసంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేలా గాతా రహే మేరా దిల్ కార్యక్రమం నిర్వహించగా, విద్యార్థులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. వేడుకలకు తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ముగింపు కార్యక్రమానికి సినీ నేపఽథ్య గాయని కౌసల్య హాజరవుతున్నారని తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన ప్రముఖ కీబోర్డ్, హార్మోనియం, వాయిద్యకారులు దుర్గాప్రసాద్ రాతో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ గాయకురాలు ఆర్.సునీత వ్యవహరించారు. ఈ కార్యక్రఓమంలో సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, భానుమూర్తి, డాక్టర్ బంగ్రారాజు, డా. రామకృష్ణారెడ్డి, సీతారాణి, మేనేజరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.