
జోరువానలో క్వారీ బాధితుల నిరసన
వర్షంలో గొడుగులతో నిరసన తెలుపుతున్న క్వారీ బాధితులు
నర్సీపట్నం : మాకవరపాలెం మండలం, జి.కోడూరు క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద జోరువానలో గొడుగులు వేసుకుని బాధితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్టా నాగరాజు మాట్లాడుతూ క్వారీ లీజురద్దు చేయాలని బాధితులు 27 రోజులుగా ఆర్డీవో కార్యాలయం నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. తక్షణమే క్వారీ రద్దు చేసి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.