నాతవరం : తాండవ రిజర్వాయరుకు సంబంధించి ఈ ప్రాంతంలో గత యాభై ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈ ఏడాది కూడా మరోసారి ప్రకృతి అక్షలారా నిజం చేసింది. మండలంలో తాండవ రిజర్వాయరు నిర్మించాక మొట్ట మొదటిసారి ప్రాజెక్టు ప్రధాన గేట్లు ఎత్తి ఆయకట్టు కు నీటిని 1974లో కాలువ ద్వారా విడుదల చేశారు. తాండవ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన రోజు తర్వాత కూడా ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది. ఈ ఆనవాయితీ సుమారుగా 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుందని ఈ ప్రాంతీయులు అంటున్నారు. తాండవ రిజర్వాయరులో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో కూడా ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేస్తే కచ్చితంగా వర్షం పడుతుంది. ఈఏడాది ఖరీఫ్ పంటసాగుకు నీరు విడుదల చేయ గా ఆ రోజు నుంచి మండలంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతోంది. తాండవ ప్రాజెక్టు నుంచి నీటిని ఆదివారం విడుదల చేసే సమయంలో 371,5 అడుగులు నీరు ఉండేది. ఇటీవల కురిసిన వర్షానికి ఇన్ ఫ్లో నీరు ప్రాజెక్టులోకి రావడంతో మంగళవారం సాయంత్రానికి 372,5 అడుగుల కు పెరిగిందని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు.
వరుణ కటాక్షం...జల ‘తాండవ’ం