
సామాజిక కార్యకర్తపై దాడికి నిరసన
తాండవ సాగునీరు విడుదల నేడు
నాతవరం: మండలంలోని తాండవ జలాశ యం నుంచి సాగునీటిని ఆదివారం విడుదల చేయనున్నట్టు తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ చెప్పారు. మధ్యాహ్నం 12.10 గంట లకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత నీటిని విడుదల చేస్తారని తెలిపారు. 2025–26 ఖరీఫ్ సీజనుకు గాను సాగునీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పరిధి లో ఉన్న రైతులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.
విశాఖ ఉక్కు సోలార్ ప్లాంట్ పునరుద్ధరణకు టెండర్లు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో గత మూడేళ్లుగా నిలిచిపోయిన 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి యాజమాన్యం టెండర్లు ఆహ్వానించింది. గతంలో ప్లాంట్ అంతర్గత అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. దీని పునరుద్ధరణ కోసం ఈ నెల 5న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18లోగా టెండర్లు దాఖలు చేయవచ్చు. టెండర్ దక్కించుకున్న సంస్థ ఆరు నెలల్లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎస్.రాయవరం: ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నూకరాజుపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ పలు సంఘాల నాయకులు ఎస్.రాయవరంలో నిరసన తెలిపారు. గోశాల అక్రమ నిర్వహణపై ఇచ్చిన ఫిర్యాదు మేర కు కక్షతో రౌడీ షీటర్ గొర్ల దేముడు, టీడీపీ నాయకుడు నమ్మింగి నానాజీ,టీడీపీ కార్యకర్త నానేపల్లి లక్షణ్‌లు ఇంటికి వచ్చి హత్యాప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసుల్లో తీవ్రత లేదని, ఇంటికి వచ్చి ముగ్గురు వ్యక్తులు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడితే హత్యాయత్నం కేసులు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. పట్టపగలు విచక్షణారహితంగా దాడి చేసినా, మండల కేంద్రం, పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలో పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తే, పోలీసులు నత్తనడకన స్పందిస్తూ, సాధారణ సెక్షన్లు రెండు వేసి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. నిందితులను వెంటనే అదుపులోనికి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నూకరాజు ఇంటి వద్ద నుంచి ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. వైఎస్సార్ విగ్రహం జంక్షన్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ విభీషణరావుకు వినతి పత్రం అందజేశారు. కాసేపు పోలీసులతో చర్చలు జరిపారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని సీఐ రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి రామాల శివనాగేశ్వరరావు, ఆర్.ఎస్. .ఎస్ కార్యకర్త సిద్దాబత్తుల చిట్టిబాబు, బీజేపీ నక్కపల్లి మండల అధ్యక్షుడు పొల్నాటి నానాజీ, ఆర్టీఐ కార్యకర్తలు పోలినాటి వీరబాబు, కోన బాబూరావు, కోడ బంగార్రాజు, గనగళ్ల రాము పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ఉత్సాహంగా పారా అథ్లెటిక్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్‌లో అంతర్ జిల్లాల పారా అథ్లెటిక్ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో జూనియర్ (19 ఏళ్లలోపు), సబ్–జూనియర్ (17 ఏళ్లలోపు) ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పి.వి.జి. ఆర్.నాయుడు ఈ పోటీలను ప్రారంభించి.. పాల్గొన్న అథ్లెట్లను అభినందించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రాక్, ఫీల్డ్ విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. టీ11–13 అంశాల పరుగు విభాగంలో ట్రాక్‌లో పరుగులందుకుని తగ్గేదేలే అంటూ పోటీపడ్డారు. ముఖ్యంగా వినికిడి లోపం ఉన్నవారు, మేధోపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలు కూడా ఈ పోటీల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన అథ్లెట్లు హర్యానాలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే అంతర్ రాష్ట్ర పారా అథ్లెటిక్ మీట్‌కు రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.

సామాజిక కార్యకర్తపై దాడికి నిరసన

సామాజిక కార్యకర్తపై దాడికి నిరసన