బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు | - | Sakshi
Sakshi News home page

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు

Aug 9 2025 5:45 AM | Updated on Aug 9 2025 5:45 AM

బాల్‌

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు

మహిళల ఉన్నతికి..
గిరిజనులకు నూరుశాతం పనులతోపాటు ఉద్యోగాలు, పదవుల్లోను రిజర్వేషన్‌ కల్పిస్తూ గత ప్రభుత్వంవలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు చట్టాన్ని తీసుకువచ్చారు. దీని వల్ల 50 శాతం మహిళలకు పలు పదవుల్లో అవకాశాలు లభించాయి.

సాక్షి,పాడేరు: తెల్లవారితే కొండపోడు వ్యవసాయం.అటవీ ఫలసాయం,ఉత్పత్తుల సేకరణతోనే ఆదివాసీల జీవన విధానం ప్రారంభమవుతుంది.అడవులలో అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తులను వారపుసంతలకు తీసుకువచ్చి వాటిని విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో వారానికి కుటుంబ పోషణకు సరపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని గ్రామాలకు తీసుకువెళ్తుంటారు.గిరిజనుల జీవన విధానమంతా అనేక కష్టాలతో కూడుకున్నదే. ఇలా సాగుతున్న జీవన విధానంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది.

● గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో ఆజాతి గిరిజనుల సంక్షేమానికి గత ఐదేళ్లలో అఽధిక ప్రాధాన్యం ఇచ్చి మౌళిక వసతులు కల్పించారు.

● గిరిజనుల సంక్షేమానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 352 సచివాలయాలను ఏర్పాటు చేసి, పరిపాలనను చేరువ చేసింది. విద్య, వైద్యం, రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

● అటవీ హక్కుల చట్టంలో భూమి పట్టాలు పొందిన సన్న, చిన్నకారు రైతులకు, మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులతో పాటు ప్రభుత్వ పథకాలు పొందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అటవీ భూములు సాగు చేస్తున్న 1,40,407మంది గిరిజనులకు 1.50లక్షల ఎకరాలను అటవీ భూములను పలు విడతలుగా పంపిణీ చేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్వహక్కులు కల్పించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక్క పట్టాకూడా ఇవ్వలేదు. అర్హులంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

నత్తనడకన పనులు : జిల్లా కేంద్రమైన పాడేరులో రూ.500కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో రిఫరల్‌ కేసుల సంఖ్య తగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు లేవు. వైద్యాధికారుల పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. వైద్యకళాశాలకు అనుబంధంగా ఏర్పాటుచేస్తున్న 500 పడకల ఆస్పత్రి పనులు నత్తనడకను తలపిస్తున్నాయి.

● రంపచోడవరంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టగా, దీనిపట్ల ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 146 పడకలతో నిర్మించే ఈ ఆస్పత్రికి రూ. 49.26 కోట్లు గత ప్రభుత్వం వెచ్చించింది. 2022 ఫిబ్రవరిలో

● నాడు–నేడు పథకంలో జిల్లాలోని 47 ఆరోగ్య కేంద్రాలను రూ.22.69 కోట్లతో అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. 12 పీహెచ్‌సీలకు రూ.18.74 కోట్లతో కొత్త ఽభవనాలను నిర్మించింది.

● జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదట విడతలో రూ.165.27 కోట్లతో 581 పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేసింది. రెండవ విడతలో 967 పాఠశాలల అభివృద్ధికి రూ.108.96 కోట్లను వెచ్చించి అభివృద్ధికి బాటలు వేసింది.

● జిల్లాలోని 1.68 లక్షల మంది గిరిజన రైతులకు ఏటా రూ.127 కోట్ల రైతు భరోసా పథకంలో సాయం అందజేసింది. కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్నప్పటికీ వీరిలో సుమారు 25 వేల మందికి అన్నదాత సుఖీభవ సాయం కోత విధించింది.

● అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంగా రూ.629.72కోట్లతో పనులు చేపట్టింది

● జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గిరిజనులకు 5జీ నెనెట్‌వర్క్‌ సేవలు అందించే లక్ష్యంగా రూ.400 కోట్లతో 2,061 సెల్‌ టవర్లను మంజూరు చేసింది. సుమారు 700 గ్రామాలకు నెట్‌వర్క్‌ను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

● రాజమహేంద్రవరం నుంచి జిల్లా మీదుగా విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి మన్యానికి వరంలా మారింది.టూరిజం కారిడార్లో భాగంగా 251.12 కిలోమీటర్ల రోడ్డును రూ.2,109,14 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టింది. ఐ.పోలవరం, గంగవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, కొయ్యూరు, కృష్ణదేవిపేట, పెదవలస, రంపుల ఘాట్‌, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, అరకు, అనంతగిరి మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది.

గిరిజనుల గుండెల్లో జగన్‌..

ప్రత్యేక జిల్లాతో పాలన చేరువ..

ఆదివాసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

నాడు ప్రగతి.. నేడు అథోగతి

మన్యంలో విలక్షణ జీవనశైలి ఆదివాసీలది. వీరి అభ్యున్నతికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేసి అభివృద్ధి, పాలన చేరువ చేసింది. ఆధునికత దిశగా అడుగులు వేసేలా తీర్చిదిద్దితే.. ఆ తరువాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పాలన చేపట్టి సుమారు ఏడాదిన్నరకు చేరువ అవుతున్నా వీరి సంక్షేమానికి తీసుకున్న చర్యలు కానరావడం లేదు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా..

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు 1
1/2

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు 2
2/2

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు రేపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement