
స్పీకర్ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం గురించి బహిరంగ సభలో ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారో రైతులకు చెప్పాలి. మా హయాంలో మంజూరు చేసిన ఏలేరు–తాండవ అనుసంధానం పనులను రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులకు సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులు ప్రజలు గమనిస్తున్నారు.
–పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే
●