
● ఏపీఎల్ ఆరంభం అదుర్స్
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ నాలుగో సీజన్ అట్టహాసంగా శుక్రవారం ప్రారంభమైంది. అయితే రెండో జట్లు బ్యాటింగ్‌కు దిగకముందే భారీ వర్షంతో మ్యాచ్ నిలిచింది. ఆరంభ మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్‌పై టాస్ గెలిచి అమరావతి రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 229 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ భరత్‌కు రాహుల్ తోడై స్కోర్‌ను పరుగులెత్తించారు. సెంచరీకి చేరువ(96, 5 ఫోర్లు, 9 సిక్సర్లు)లో రాహుల్ ఔటవగా, భరత్(93, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా సెంచరీని చేజార్చుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లలో 173 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. అమరావతి రాయల్స్ బ్యాటర్లు రాణించడంతో 13.2 ఓవర్లలోనే 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి, విజయకేతనం ఎగురవేశారు.
భరత్, రాహుల్ సెంచరీల మిస్
వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదింపు
13.2 ఓవర్లలో అమరావతి రాయల్స్ లక్ష్య ఛేదన

● ఏపీఎల్ ఆరంభం అదుర్స్

● ఏపీఎల్ ఆరంభం అదుర్స్