
వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
అనకాపల్లి: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే వాలీబాల్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక శుక్రవారం జరిగింది. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోందని, ఇందులో పాల్గొనే జిల్లా జట్లను ఎంపిక చేశామని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి ఎల్.వి.రమణ చెప్పారు. శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలురు, 16 మంది బాలికలు పాల్గొన్నారని చెప్పారు. రిలో బాలుర విభాగంలో 25 మందికి ఈనెల 13 వరకు శిక్షణ ఇస్తున్నామని, వీరిలో ఎంపిక చేసిన 12 మంది బాలురు విశాఖలో ఈనెల 16 నుంచి 20 వరకు జరిగే జోనల్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. అక్కడ గెలుపొందిన జట్లు ఈనెల 21 నుంచి 25 వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జట్లకు కోచ్ కం మేనేజర్లుగా భీశెట్టి శ్రీనివాసరావు, విల్లూరి ప్రసాద్ వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు కె.ఎన్.వి సత్యనారాయణ, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు ఎల్లపు గోవింద, రాపేటి సీతారాం, ఆడారి హరి ప్రభాకర్, పీలా రమణారావు, బుద్ధ శివ, ఎల్లపు సత్యనారాయణ, శిలపరశెట్టి భాస్కరరావు, మోటూరి నాగేశ్వరరావు, పీఈటీలు ఎస్.వి.నరసింహం, కె.ఎం.నాయుడు పాల్గొన్నారు.