
అనువాద ప్రతిభతో ఆరు అవార్డులు
సమావేశమే జరగకుండా తీర్మానమా?
ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి మరో రికార్డు
8లో
రోలుగుంట: ఆమె ఆంగ్ల ఉపాధ్యాయిని.. తన అసమాన క్రీడా ప్రతిభతో గతంలో ఆమె వార్తలకెక్కారు. ఇప్పుడు అనువాదంలో అందె వేసిన చేయిగా నిరూపించుకొని ఏకంగా ఆరు అవార్డులు సాధించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ పోటీలలో ఎన్నో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం సింగపూర్, మలేషియాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. ఇప్పుడు మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు వరల్డ్ రికార్డు హోల్డర్, రెప్లికా ఆర్టిస్ట్ డాక్టర్ దార్ల నాగేశ్వరరావు ‘ఎవెరీడే సెల్యూట్ టు ఉమెన్స్’ కాన్సెప్ట్ నడుపుతున్నారు. దీని కోసం నాగ జ్యోతి ఏడాదిపాటు ప్రతిరోజు తెలుగులో ఉన్న విషయాన్ని ఇంగ్లిష్ భాషలో అనువదించారు. ఆమె ప్రతిభకు ముగ్ధులైన ప్రపంచ రికార్డు సంస్థల వారు అవార్డులను అందజేశారు. దార్ల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఫ్యాబులస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఫెంటాస్టిక్ అచీవ్‌మెంట్స్ అండ్ రికార్డ్స్, ఇండియా రికా, మార్వలెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను వరించాయి. వీటిని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దార్ల నాగేశ్వరరావు, సుమన్, శ్రీకాంత్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల హెచ్‌ఎం డి.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద్, సహచర సీనియర్ టీచర్లు ఆర్.వి.ఎస్.ఆర్.శర్మ, శ్రీరామ్మూర్తి, విద్యాకమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.