అనకాపల్లి: ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు సోమవారం చెప్పారు. డీఎస్పీ కథనం మేరకు వివరాలివి. స్థానిక నర్సింగరావుపేటకు చెందిన ఇంజరపు జయ, పక్కనే ఇంటిలో నివసిస్తున్న ఉరుకుల జ్యోతికి ఆరు సంవత్సరాలు క్రితం రూ. 2లక్షల నగదు అప్పుగా ఇచ్చింది. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చేది. అయితే ఆరునెలల నుంచి అసలు, వడ్డీ ఇవ్వకపోవడంతో ఈనెల 16 జయ, జ్యోతికి చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈనెల 18 ఇంజరపు జయ, జ్యోతి, జ్యోతి కుమార్తె వీనస్‌లపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేరోజు వీనస్ కులం పేరుతో దూషించినట్టు జ్యోతి కుమార్తె వీనస్ ఇంజరపు జయ, జయ భర్త ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు గాయత్రి, పూర్ణశ్రీలపై ఫిర్యాదు ఇవ్వడంతో, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.