
అంగన్‌వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
బుచ్చెయ్యపేట: మండలంలోని మంగళాపురం, కుముదాంపేట తదితర గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ జి.చిన్మయి దేవి సోమవారం తనిఖీ చేశారు. పిల్లలను లెక్కించి హాజరు పట్టికలను పరిశీలించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత ఎలా ఉందో చూశారు. సంపూర్ణ పోషణ కిట్లు, ఇతర ఆహార పదార్థాలు బాగానే అందుతున్నాయని పలువురు తెలపడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది రాధాలక్ష్మి, పార్వతీదేవి, అరుణ తదితర్లు పాల్గొన్నారు.