
కాపు వనభోజన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
ఆరిలోవ(విశాఖ): ఆరిలోవ ప్రాంతం ముడసర్లోవ పార్కులో విశాఖ కాపు యూత్ కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కాపు సామాజిక వర్గం ప్రముఖులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు, డాక్టర్ పీవీ సుధాకర్, సింహాచలం దేవస్థానం ట్రస్టు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు తదితరులు మాట్లాడారు. తూర్పు కాపు, మున్నూరు కాపు, తెలగ, బలిజ అందరూ ఒక్కటేనని తెలిపారు. ఎలాంటి బేధం లేకుండా కాపులంతా ఒకటిగా కలసిమెలసి మెలగాలన్నారు. జీవీఎంసీ యూనియన్ నాయకుడు మహదేవ ఆనంద్, తోటరాజు, మూర్తి, గుంటూరు న ర్సింహమూర్తి, విశాఖ కాపు యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సురేష్, కార్యదర్శి వై .సురేష్, కోశాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.