● ఎస్పీ అమిత్ బర్దర్
సాక్షి, పాడేరు: ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జిల్లాలో నేరాల నమోదులో మిశ్రమ ధోరణి కనిపించిందని ఎస్పీ అమిత్బర్దర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలు ఒక కేసు నుంచి మూడు కేసులకు పెరిగాయని, 200 శాతం వృద్ధి నమోదైందన్నారు. శారీరక దాడులకు సంబంధించిన నేరాలు నాలుగు కేసుల నుంచి రెండుకు తగ్గి 50 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు ఎనిమిది నుంచి తొమ్మిదికి పెరిగి 13 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఎన్డీపీఎస్ కేసులు ఏడు నుంచి ఆరుకు తగ్గి 14 శాతం, మహిళలపై నేరాలు మూడు నుంచి రెండుకు తగ్గి 33 శాతం తగ్గుదల నమోదైందని ఎస్పీ వివరించారు.


