● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● రెండో కుమారుడిని కోల్పోయిన తల్లి
● గుండెలవిసేలా రోదన
● కట్టతడి పెట్టించిన ఆర్తనాదాలు
కొయ్యూరు: మండలంలోని ఎం.మాకవరం గ్రామానికి చెందిన పొడుగు లోవబాబు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 26న (బుధవారం) సర్పంచ్ ఎన్నికలు ఉండటంతో ఓటు వేసేందుకు మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో సరదాగా గడిపాడు. బుధవారం సాయంత్రం ఎం.మాకవరం నుంచి కొయ్యూరు వస్తుండగా కాకరపాడు సమీపంలో అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. వేగంగా వస్తుండటంతో బైక్‌ను నియంత్రించలేకపోయాడు. దీంతో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన డివైడర్‌ను అతని తల బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై లోవబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని లోవబాబు మృతదేహం వద్ద బోరున విలపించారు. రత్నం పెద్ద కుమారుడు మణికంఠ కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. వరుసగా ఇద్దరు కుమారులను కోల్పోవడంతో ఆమె రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. లోవబాబు వెనుక కూర్చున్న స్నేహితుడు కోడా రమేష్‌కు తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతనికి రాజేంద్రపాలెం ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. తహసీల్దార్ ప్రసాదరావు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఓ కుమారుడిని కోల్పోయిన ఆ తల్లి చెప్పలేని వేదనను అనుభవించింది. తాజాగా రోడ్డు ప్రమాదం రూపంలో మరో కుమారుడిని కోల్పోవడంతో ఆ తల్లి ఆర్తనాదాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. 2021లో వైఎస్సార్ సీపీ తరఫున చింతలపూడి ఎంపీటీసీగా గెలుపొందిన పాడుతు రత్నం కుమారుడు పొడుగు లోవబాబు (కుమార్) (24) బుధవారం సాయంత్రం కాకరపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారి బంధువుల ఆర్తనాదాలతో మార్మోగింది.


