ముంచంగిపుట్టు: నూతనంగా ఎన్నికై న అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వంతాల శాంతిని ముంచంగిపుట్టు ఎంపీపీ మజ్జి సుబ్బలక్ష్మి, మండల వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం పాడేరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును కలిశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ వంతాల శాంతి, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజులకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు సీతమ్మ, నాగరత్నం, ప్రమీల, రఘుపతిపడాల్, చంద్రబాబు, మండల నాయకులు రామ్మూర్తి, గణపతి, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.


